ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛాయుత, నౌకాయానం, భద్రత, సుసంపన్నత లక్ష్యంగా ఈ ప్రాంతంలోని దేశాలతో కలిసి పనిచేయాలని అమెరికా ఆకాంక్షిస్తోందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కంబోడియా రాజధాని పినామ్‌పెన్‌లో యూఎస్`ఆసియన్ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. ఇండో పసిఫిక్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆసియాన్ కూటమిలోని 10 దేశాలు తమకు ఎంతో కీలకమైనవని వెల్లడిరచారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆదిపత్యాన్ని చెలాయిస్తున్న చైనాను నిలువరించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ చైనా సముద్రం నుంచి మయన్నార్ వరకు ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని బైడెన్ పిలుపునిచ్చారు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లోనూ కలిసి పని చేసేందుకు అవకాశం ఉందన్నారు.
