కొన్ని రోజుల క్రిందటే ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప దేశభక్తుడని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు. తాజాగా… రష్యా ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పుతిన్ భారత్ పై ప్రశంసలు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిని నడిపేవారని ప్రశంసించారు. భారత్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఒకటిన్నర బిలియన్ జనాభా వున్న భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ప్రతిభావంతులైన వారు భారత్ లో వున్నారని, అభివృద్ధి వైపు నడిపే ప్రజలున్నారని, భారతదేశాన్ని చూద్దామని పిలుపునిచ్చారు. ఇక… భారత్ తర్వాత రష్యా నాగరికత గురించి పుతిన్ పేర్కొన్నారు. రష్య ఒక గొప్ప రాజ్యమని, బహుళ జాతి దేశమని అన్నారు. యూరోపియన్ కల్చర్ లో భాగమని పేర్కొన్నారు.
