బింబిసార దర్శకుడు వశిష్ఠ చేతులమీదుగా ‘లెహరాయి’టీజర్

సక్సెస్ ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీ నటులుగా  ప్రముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ ఫ్యాష‌న్ తో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం “లెహరాయి” .ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా ఫ్యామ‌స్ కావ‌టం విశేషం.ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల‌య్యిన గుప్పెడంత సాంగ్ ఆర్గానిక్ గా మిలియ‌న్ వ్యూస్ రావ‌టం, ఆ సాంగ్ ని వంద‌ల్లో రీల్స్ చేయ‌టం ఈ సాంగ్ పాపులారిటి తెలుస్తుంది. రెండ‌వ సాంగ్ ని టాలెంటెడ్ ట్రెండి సింగ‌ర్ సిధ్ధ్ శ్రీరామ్ ఆల‌పించారు. మూడో పాట “అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ” ఇలా ఈ సినిమాలోని ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా హైదరాబాద్ చిత్ర యూనిట్ “లెహరాయి” చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యం అతిధులుగా వచ్చిన బింబిసార డైరెక్టర్ వశిష్ట చేతులమీదుగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  గెస్ట్ గా వచ్చిన బింబిసార దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది. శ్రీనివాస్ గారు చక్కటి సినిమా తీశారు. దర్శకుడికి మెదటి సినిమా ద్వారా ఎంత టెన్షన్ పడతాడో తర్వాత అంత ఎంజాయ్ చేస్తాడు.నా స్కూల్ డేస్ లో ఘంటాడి గారి పాటలు వినేవాన్ని ఈ సినిమాకు కూడా మంచి పాటలు అందించాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది తను కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి అన్నారు. చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా “లెహరాయి” టీజర్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.ఈ “లెహరాయి” సినిమాలో మంచి కంటెంట్ ఉంది.ఈ చిత్రం ద్వారా తల్లి తండ్రులకు ,యువతీ, యువకులకు విద్యార్ధి విద్యార్థినిలకు,సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాము అనుకుంటున్నాము.ఈ సినిమా కొరకు టీం అందరూ ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు.త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ..మా సినిమా టీజర్ లాంచ్ కు వచ్చిన డైనమిక్ డైరెక్టర్ వశిష్ట కు ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది.పక్కా హిట్ కొట్టబోతున్నాము.ఇది నా ఒక్కరి కష్టం కాదు. నిర్మాత శ్రీనివాస్ బెక్కం వేణుగోపాల్ సపోర్ట్ తో అలాగే నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అన్నారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. ఇందులోని పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలోని ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటాయి.ఆడియో కంటే సినిమా చాలా బాగుంటుంది. దర్శకుడు ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించాడు. చాలా రోజులు తర్వాత మంచి ఫీల్ గుడ్ స్టోరీ తో మంచి మెసేజ్ తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని కథlo చాలా ఎమోషన్స్ ఉంటాయి..ఇందులో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఘంటాడి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు  నటి సంధ్య జనక్ మాట్లాడుతూ..చాలా రోజుల తర్వాత మంచి స్టోరీ తో, మంచి కథతో వస్తున్న ఈ మూవీలో నేను మదర్ రోల్ లో సీనియర్ నరేష్ తో చేశాను. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి మెసేజ్ తో వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు. నటీనటులు రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ,సత్యం రజెష్,జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు సాంకేతిక నిపుణులు ప్రజెంట్ : బెక్కం వేణుగోపాల్ బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్ రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ) డి.ఓ.పి :  ఎం ఎన్ బాల్ రెడ్డి ఎడిటర్ : ప్రవీణ్ పూడి లిరిక్ రైటర్స్ :;రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ :  శంకర్ కొరియోగ్రాఫర్స్ :  అజయ్ సాయి రైటర్ : పరుచూరి నరేష్ పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్