సీపీఎం నేత బృందా కారత్ కి చేదు అనుభవం… ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిరసనకారుల డిమాండ్

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ కి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. జంతర్ మంతర్ దగ్గర రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేపడుతున్నారు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని, ఉపన్యాసం ఇవ్వాలని బృందా కారత్ అక్కడికి చేరుకున్నారు. ఉపన్యసించడానికి మైక్ పట్టుకోవడానికి స్టేజీపై ఎక్కుతుండగా రెజ్లర్లందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ వేదిక కాదని, దీనిని రాజకీయ వేదికగా మార్చేయవద్దని గట్టిగా సమాధానమిచ్చారు. దీంతో… ఆమె వేదిక ఎక్కకుండా రెజ్లర్లందరూ అడ్డుకున్నారు. అలాగే… ఇదే సమయంలో కొందరు రెజ్లర్లు భారత్ మాతాకీ జై… అంటూ నినాదాలు కూడా చేశారు. చివరికి చేసేదేమీ లేక.. బృందా కారత్ అక్కడి నుంచి నిష్క్రమించారు.

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూష‌ణ్‌పై మ‌హిళా రెజ్లర్లు లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగ‌ట్ ఆధ్వర్యంలో బుధ‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ నిర‌స‌న ప్రద‌ర్శన కూడా చేప‌ట్టారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూష‌ణ్‌తో పాటు అనేక మంది కోచ్‌లు లైంగికంగా వేధింపుల‌కు పాల్పడుతున్నార‌ని వినేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు.

 

Related Posts

Latest News Updates