కొలీజియంలో ప్రభుత్వాన్ని చేర్చండి.. సీజేఐకి సిఫార్సు చేసిన కిరణ్ రిజిజు

కొలీజియం విషయంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కీలక సిఫార్సు చేశారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కి కిరణ్ రిజిజు లేఖ రాశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు కచ్చితంగా చోటు కల్పించాలని కోరారు. పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అత్యంత ఆవశ్యకమని అన్నారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత, ఆబ్జెక్టివిటీ, సామాజిక వైవిధ్యం లోపించడంపై వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయ‌ని అన్నారు.

Related Posts

Latest News Updates