మలయాళం నుంచి వచ్చి తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ప్రేమలు (Premalu). తెలంగాణ, హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్‌లో విడుదలై ఒక్క కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మార్చి 08న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్‌తో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఇప్పటివరకు తెలుగులో రూ.15 కోట్లకు పైగా వసూళ్లను తీసుకువచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా మార్చి 29 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఓటీటీ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తమిళ తెలుగు వెర్షన్స్‌లో థియేటర్లలో ఆడుతున్న సమయంలో ఓటీటీకి రిలీజ్ చేయడం సబబు కాదని భావించిన నిర్మాతలు ఈ సినిమా ఓటీటీ డేట్‌ను కొన్ని రోజులు వాయిదా వేయమని కోరినట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌పై త్వరలోనే మరో కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ దర్శకత్వం దర్శకత్వం వహించగా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా హైదరాబాద్‌లోనే జరుపుకోవడం విశేషం. కేరళ నుంచి తెలంగాణకు జాబ్ చేయడానికి వచ్చిన మలయాళీలు ఇక్కడ ఎలా ఉన్నారు అనే చిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది.