సింగపూర్ నుంచి మూడు నెలల తర్వాత స్వదేశానికి లాలూ ప్రసాద్ యాదవ్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. కిడ్నీ, గుండె సంబంధి సమస్యతో బాధపడుతున్న ఆయన  గతేడాది డిసెంబర్‌లో  చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అక్కడ  లాలూకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని సింగపూర్ వైద్యులు లాలూకు విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్ అనంతరం అక్కడే కోలుకుంటున్న లాలూ శనివారం రాత్రి భారత్ చేరున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానాలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానుకు అభివాదం చేస్తూ తన నివాసానికి వెళ్లిపోయారు.

Related Posts

Latest News Updates