కెర్చ్ వంతెన పేలిన తర్వాత… రష్యా ఉక్రెయిన్ పై తీవ్రంగా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై 75 క్షిపణులతో రష్యా తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు మీడియా పేర్కొంది. ఈ బాంబుల వర్షంలో కీవ్ నగరంలో నడిబొడ్డునే వున్న ఆఫ్ గ్లాస్ పై బాంబులు పడ్డాయి. దీంతో వంతెన కూలి బూడిదైపోయింది. అలాగే పార్కులపై కూడా బాంబులు పడ్డాయి. దేశ వ్యాప్తంగా కీవ్ తో పాటు జైటోమిర్, ఖెల్నిట్స్కీ, డెనిప్రో, ల్వీవ్, టెర్నోపిల్ నగరాలై రష్యా రాకెట్లు పడ్డాయి.
ఈ దాడుల్లో మొత్తం 8 మంది పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రిమియా బ్రిడ్జి కూల్చివేతలో ఉక్రెయిన్ హస్తముందని రష్యాకు ఆధారాలు దొరకడంతోనే ఈ ప్రతీకార దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ను భూమిపై లేకుండా రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. దేశంలోని పలు నగరాలపై రష్యా క్షిపణి దాడులు చేసిందని, ఇందులో చాలా మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.