కుప్పం ఇకపై పోలీసు సబ్ డివిజన్.. ఉత్తర్వులు జారీ

కుప్పం ఇకపై పోలీసు సబ్ డివిజన్ అవనుంది. ఈ మేరకు కుప్పం ను పోలీసు సబ్ డివిజన్ ను చేస్తూ ప్రభుత్వం జీవో 147 గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సబ్ డివిజన్ కు ఎస్ పీడీఓ కార్యాలయం కుప్పంగా అందులో పేర్కొన్నారు. పలమనేరు పోలీసు సబ్ డిబిజన్ లోని కుప్పం, గుడపల్లి, రాళ్లబూదుగూరు, రామకుప్పంతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లితో కలిపి మొత్తం 6 స్టేషన్లను రూపొందించారు. త్వరలో ఇక్కడ డీఎస్పీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

Related Posts

Latest News Updates