కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ …రిషి సునాక్ కుమార్తె నృత్య ప్రదర్శన

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కుమార్తె అనౌష్క సునాక్‌  లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. రాంగ్‌-2022 పేరుతో ఇంటర్నేషనల్‌ కూచిపూడి డాన్స్‌ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ప్రపంచ నలుమూలల నుంచి 4-85 ఏళ్ల మధ్య వయసు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో సునాక్‌ కుమార్తె కూడా పాల్గొన్నారు. కొందరు చిన్నారులతో కలిసి అనౌష్క ఇచ్చిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.  ఈ వేడుకకు రిషి సతీమణి అక్షతా మూర్తి, సునాక్‌ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Related Posts

Latest News Updates