హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం కావాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్ ప్రీత్ సింగ్ కు లేఖ రాశారు. రెండో దశ కింద నిర్మించబోయే బీహెచ్ ఈఎల్- లక్డీకాపూల్, నాగోల్- ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని లేఖలో కోరారు. ఫేజ్ 2 విస్తరణకు 8453 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశామని, దీనికోసం 2023-2024 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని మంత్రి కోరారు.







