ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఏమి ఆశ్చర్యం అంటూ ఇమోజీని పెట్టారు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల త్వాత బీబీసీ ఇండియాపై ఐటీ దాడులా? అంటూ చురకలంటించారు. ఐటీ, సీబీఐ, ఈడీ ఏజెన్సీలు బీజేపీకి కీలు బొమ్మలుగా మారిపోయాయని విమర్శించారు. తర్వాత హిండెన్ బర్గ్ పై ఈడీ దాడులా? లేక టేకోవర్ ప్రయత్నాలా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీబీసీపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థ‌లు రాసిన క‌థ‌నాల‌ను త‌న ట్వీట్‌లో మంత్రి ట్యాగ్ చేశారు.

 

BBC కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని BBC కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. దాడుల సందర్భంగా అక్కడి పాత్రికేయుల ఫోన్లను ఐటీ అధికారులు తీసేసుకున్నారు. ఇళ్లకు వెళ్లిపోవాలని కూడా సూచించారు. ఫోన్లతో పాటు సిస్టమ్ లను కూడా ఐటీ అధికారులు తీసేసుకున్నారు. అయితే…. ఇవి సోదాలు కాదని, పన్నుల అవకతవకల ఆరోపణలకు సంబంధించి సర్వే మాత్రమేనని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చెల్లింపుల రికార్డులను ఐటీ పరిశీలిస్తోంది. పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. అకౌంట్ బుక్స్‌ను చెక్ చేస్తున్నామ‌ని, త‌నిఖీలు నిర్వ‌హించ‌డంలేద‌న్నారు. సిబ్బంది బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్దు అని అధికారులు ఆదేశించారు. ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో సుమారు 20 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్‌లో కూడా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. డాక్యుమెంట్ల‌ను సీజ్ చేశారు.

https://twitter.com/KTRBRS/status/1625403947187052544?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1625403947187052544%7Ctwgr%5Ee066c6ee0735f0fb4fbad675d9cb521e34756d9c%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fwhat-next-ed-raids-on-hindenberg-or-a-hostile-takeover-attempt-ktr-raises-question-after-it-raids-on-bbc-968214