కేంద్రంలోని బీజేపీ సర్కారును తరచూ అమృత్ కాల్ అమృత్ కాల్ అంటూ వాడటంపైరాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ పాలనా కాలాన్ని ‘అమృత్ కాల్ (మంచి కాలం)’గా చెప్పుకుంటుండటంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో సైటెర్ వేశారు. ‘అమృత్ కాల్’ అనే పదం కంటే ‘మిత్ర్ కాల్ (దోస్తుల కాలం)’ అనే పదం బాగా సూటవుతుందని తన ట్విటర్ అకౌంట్లో మంత్రి పోస్టు పెట్టారు. ‘ఎ మోర్ ఆప్ట్ నేమ్ ఫర్ అమృత్ కాల్ ఈజ్ ఎ మిత్ర్ కాల్, వాట్ డూ యూ సే గైస్..?’ అని మంత్రి ఆంగ్లంలో ట్వీట్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర మధ్య నెలకొన్న బెలగావి సరిహద్దు సమస్యను ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోదీ పరిష్కరించలేకపోయాడని కేటీఆర్ తెలిపారు. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని మాత్రం ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
A more apt name for “Amrit Kaal” is
“A Mitr Kaal”
What do you say Guys? #MitrVaad #CronyCapitalism
— KTR (@KTRBRS) February 21, 2023