తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా… టెలికాం రంగంలో అగ్రగామి సంస్థగా వున్న భారతీ ఎయిర్ టెల్ హైదరాబాద్ లో 2 వేల కోట్లతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో సాంకేతికతకు అనుబంధంగా వుండే నెక్స్ ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం 2 వేల కోట్లను పెట్టుబడిగా పెడతామని సంస్థ ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ భేటీ అయ్యారు.
ఈ సమావేశం తర్వాతే 60 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాబోయే 7 సంవత్సరాల్లో పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగిస్తామని సంస్థ ప్రకటించింది. తెలంగాణలో ఎయిర్‌టెల్ పెట్టుబడులు పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్‌టెల్-నెక్స్‌ట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని అన్నారు.
#TriumphantTelangana bags major investment – Bharti Airtel Group @airtelindia to set up large Hyperscale Data Centre in Hyderabad with ₹2000 Cr.
The announcement came after the Group's Founder & Chairman Sunil Bharti Mittal, VC Rajan Bharti Mittal met Minister @KTRTRS at #wef23 pic.twitter.com/9PVErOR2K8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 18, 2023