మెడికల్ కాలేజీల కేటాయింపుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కిషన్ రెడ్డిని ఓ సోదరుడిగా కచ్చితంగా గౌరవిస్తానని.. కానీ మెడికల్ కాలేజీల కేటాయింపు గురించి మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మాత్రం కచ్చితంగా ఖండిస్తానని, తప్పుడు సమాచారం ఇచ్చే కేంద్ర మంత్రిని చూడలేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. కానీ దాన్ని గుజరాత్‌కు తరలించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కానీ.. తప్పును మాత్రం సరిదిద్దుకోవడం లేదన్నారు. తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం ఎందుకు తుంగలో తొక్కుతుందో చెప్పాని కేటీఆర్ డిమాండ్ చేశారు.
https://twitter.com/KTRTRS/status/1576061689975386114?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1576061689975386114%7Ctwgr%5E345dd5ad59c290a2529f0838e17a6c992bb85836%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fminister-ktr-fire-on-union-minister-kishan-reddy-784337