చ‌క్కటి కుటుంబ క‌థా చిత్రంగా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’

చ‌క్కటి కుటుంబ క‌థా చిత్రంగా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ మంచి విజయాన్ని సాధించాలి: ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్‌

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆగ‌స్ట్ 4న ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా..

ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’కు ఆల్ ది బెస్ట్. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంగా సినిమాను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతీ టీం మెంబర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ అని అన్నారు.

టీఎఫ్‌సీసీ సెక్రటరీ, నిర్మాత కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఉంటే సినిమాలు ఆడుతాయి. కంటెంట్‌ను మాత్రమే కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలి. అవి రెండూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి విలేజ్, లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. ఈ మూవీకి వారిద్దరూ కూడా సెట్ అయ్యారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘నిర్మాత రఘు ఈ మధ్యే పరిచయం అయ్యారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో రిస్క్ చేసి మంచి కథను ఎంచుకుని సినిమా తీశారు. నా కెరీర్ స్టార్టింగ్‌లో సినిమాకు సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా.. ప్యాషన్‌తో వచ్చాం. ఇక్కడే అంతా నేర్చుకున్నాం. నేను ఆల్రెడీ సినిమాను చూశాను. అద్భుతంగా ఉంది. మ్యూజిక్ బాగుంది. కెమెరావర్క్ బాగుంది. కొత్త వాళ్లతో దర్శకుడు సినిమాను బాగా తీశారు. అందమే కాదు నటనతో అందరినీ ఆకట్టుకోవచ్చు. విస్మయ అద్భుతంగా నటించింది. రిష్వి ఎక్కడా కూడా కొత్త హీరోగా అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా నటించాడు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 4న ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలి’ అన్నారు.

నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి మాట్లాడుతూ.. ‘రెండున్నరేళ్ల ప్రయాణం ఈ సినిమా. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసుకుంటూ సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్ అని అందరూ అడుగుతున్నారు. సినిమా ద్వారా మనుషుల్ని కదలించొచ్చు. ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. కృష్ణ అనే యువ‌కుడి క‌థే ఇది. తండ్రి క‌ల‌ను నేర‌వేర్చ‌టానికి కొడుకు ప‌డ్డ క‌ష్టం. త‌న ప్రేమ‌, భావోద్వేగాల‌ను అందంగా చూపించే ప్ర‌య‌త్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజేష్ గారు మలిచారు. చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతూ ఉంటే వచ్చే సంఘర్షణను చూపించాం. రిష్వి మాస్ హీరో. రిష్వి, విస్మయలది క్యూట్ పెయిర్. ఆగస్ట్ 4న మా సినిమా రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ రాజేష్ దొండపాటి మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ రాము వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. రాము తన ఫ్రెండ్‌, నిర్మాత రఘు గారిని పరిచయం చేశారు. నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా నిర్మాతకు ఎంతో గట్స్ ఉన్నాయి. మమ్మల్ని నమ్మి మాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రఘు గారికి థాంక్స్. నా టీం మెంబర్లందరికీ థాంక్స్. కృష్ణ, సత్య పాత్రల్లో రిష్వి, విస్మయ అద్భుతంగా నటించారు’ అని అన్నారు.

రిష్వి తిమ్మరాజు మాట్లాడుతూ.. ‘నాకున్న సినిమా పిచ్చిని, ఆసక్తిని గుర్తించి మా అమ్మానాన్నలు ప్రోత్సహించారు. మా నిర్మాత రఘురామ్ గారు అమెరికాలో ఉంటూ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. డైరెక్టర్ రాజేష్ దొండపాటి గారే ఈ సినిమాకు హీరో. విస్మయ ఎంతో సహకరించింది. ఇద్దరం స్క్రీన్ మీద మ్యాజిక్ చేశాం. మా కెమెరామెన్ రఫి గారు మమ్మల్ని ఎంతో అందంగా చూపించారు. ఆగస్ట్ 4న మా టీంకు చాలా ఇంపార్టెంట్. మా టీం అంతా థియేటర్‌కు వస్తోంది. ఆగస్ట్ 4న మా సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా చూడండి. నచ్చితే పది మందికి చెప్పండి. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

విస్మయ శ్రీ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. సత్య లాంటి మంచి పాత్ర మళ్లీ వస్తుందో లేదో తెలియదు. నన్ను నేను నిరూపించుకునేందుకు ఈ కారెక్టర్ దొరికింది. సాబు గారి సంగీతం అద్భుతంగా వచ్చింది. రఫి గారు మమ్మల్ని అందంగా చూపించారు. రిష్వి చాలా మంచి నటుడు. డైరెక్టర్‌కు ఏం కావాలో అది చేస్తుంటాడు. ఆగస్ట్ 4న మా సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

లిరిక్ రైటర్ వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. ‘విలేజ్ వాతావరణాన్ని ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఉద్యోగం కోసం సిటీకి వస్తుంటారు. కానీ ఆ గ్రామీణ వాతావరణాన్ని మాత్రం మరిచిపోరు. సాబు గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్. మన భాష తెలియకపోయినా మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. రిష్వి, విస్మయ అద్భుతంగా నటించారు. గత ఏడాది నేను పాట రాసిన బింబిసార ఆగస్ట్ 5న వచ్చి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ 4న రాబోతోంది. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రైటర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వస్తుందో లేదో గానీ.. ప్యాషన్ ఇన్వెస్ట్ మాత్రం పదింతల డబ్బు, పేరు తిరిగి వస్తుంది. దానికి నేనే ఉదాహరణ. జయం సినిమాలో సదా, నితిన్‌లా విస్మయ, రిష్విలు కనిపిస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరికుప్పల గారు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ అండర్ రేటెడ్ లిరిక్ రైటర్. ఆగస్ట్ 4న ఈ సినిమా రాబోతోంది. దిల్ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్ గార్ల సాయంతో సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందరూ సినిమాను చూడండి’ అని అన్నారు.

Related Posts

Latest News Updates