ఏ పి-తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు  అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు. కృష్ణంరాజును చివరిసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.  రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు  పూర్తయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు రెబల్ స్టార్‌ను చివరిసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో క్షత్రియ సాంప్రదాయ ప్రకారం రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు పార్థీవదేహాన్ని అంతిమయాత్రగా తీసుకువచ్చి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ రాజ్ చితికి నిప్పంటించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణంరాజు కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ నివాసం ఉండేందుకు ఓ ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. కానీ అది పూర్తి అవ్వకముందే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ముందుగా అనుకున్నట్లు మహాప్రస్థానంలో కాకుండా.. కృష్ణంరాజు నివాసం ఉండాలకున్న వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం