శ్రీకృష్ణుడి జన్మభూమి షాహీ ఈద్గా కేసు వివాదంలో ఓ కీలక పరిణామం జరిగింది. యూపీలోని మథుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు అమిన్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 20 వ తేదీలోగా సర్వే పూర్తి చేసి… ఆ నివేదికను తమ ముందు వుంచాలని ఆదేశించింది. హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త ఈ కేసులో పిటిషన్ దాఖలు చేశారు. వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసు తరహాలోనే.. ఈ కేసులోనూ సర్వే చేపట్టనున్నారు. కట్రా కేశవ్ దేవ్ ఆలయంలో ఉన్న 17వ శతాబ్ధం నాటి షాహి ఈద్గా మజీదును తొలగించాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. కృష్ణ భగవానుడు పుట్టిన ప్రదేశంలో ఆ మసీదును నిర్మించినట్లు హిందూ సేన ఆరోపిస్తోంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు ఆ మసీదును నిర్మించినట్లు తెలిపారు.