ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు భేటీఅయ్యారు. తమ రెండో కుమారుడి వివాహానికి రావాలంటూ కొండా దంపతులు మోదీని ఆహ్వానించారు. అందుకే ఢిల్లీకి వచ్చి కలిశామని దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్య, వైద్యం గురించి మాట్లాడుకున్నామని కొండా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక… తాము చేపట్టిన స్వచ్ఛ ట్రక్, బయోగ్యాస్ ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించారు.
మా రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి గారిని కలిషినం. ఎంతో ఆప్యాయంగా పలుకరించిన్రు. తెలంగాణలో వైద్యం, విద్య, ఇతర విషయాల పట్ల చర్చించినం. మా స్వఛ్చ్ ట్రక్ ఇంకా బాయో గ్యాస్ ప్రాజెక్ట్ ల గురించి మోదీ గారికి వివరించి చెప్పిన. ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు pic.twitter.com/584ufRrP4X
— Konda Vishweshwar Reddy (@KVishReddy) November 18, 2022