ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు.. ఉత్తర్వులిచ్చిన సర్కార్

ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీని వేగిరం చేసింది. ఈ ఒక్క రోజే రెండు కీలక పోస్టులను భర్తీ చేసింది. ఇందులో భాగంగా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస రావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. మరోవైపు 2 సంవత్సరాల పాటు కొమ్మినేని ఈ పదవిలో కొనసాగుతారు. కొమ్మినేని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, సాక్షి ఇలా దాదాపు 33 సంవత్సరాల పాటు తెలుగు పాత్రికేయ రంగంలో కొనసాగుతున్నారు. సబ్ ఎడిటర్ గా, రిపోర్టర్ గా, చీఫ్ రిపోర్టర్ గా, ఢిల్లీలో ఈనాడు బ్యూరో చీఫ్ గా పనిచేశారు. 4 సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికకు బ్యూరో చీఫ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సాక్షిలో లైవ్ షో విత్ కెఎస్ ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Related Posts

Latest News Updates