మునుగోడు ఉపఎన్నిక ఫలితం కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయరంగ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. వ్రతం చెడిరది.. ఫలితం కూడా దక్కలేదన్నట్లుగా అటు తమ్ముడు ఓడిపోయాడు. ఇటు అన్న ఉన్న పార్టీకి డిపాజిట్ దక్కలేదు మధ్యలో విజయాన్ని టీఆర్‌ఎస్ కాజేయడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇప్పుడు ఏమి చేయాలో తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో కుట్రలు కుతంత్రాలకు వేదికైన మునుగోడులో బీజేపీ తరపున పోటీచేసిన రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ వెంకటరెడ్డి చేయని ప్రయత్నం లేదంటారు. ఫోన్ కాల్స్ చేస్తూ తమ్ముడిని గెలిపించాలని ఆయన చేసిన కాల్స్ కాంగ్రెస్ వర్గాల్లో సంచలనాన్ని కలిగించాయి. కాంగ్రెస్‌లోనే ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిరచిన వెంకటరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మునుగోడులో తమ్ముడు గెలవలేదు. కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతైంది. దీంతో ఈ ఇద్దరు బ్రదర్స్‌కు రాజకీయంగా సమాధే అన్న చర్చ సాగుతోంది. ఈ మునుగోడు ఫైట్‌లో టీఆర్‌ఎస్ బీజేపీ మధ్య జరిగిన రాజకీయ పోరాటంలో నిండా మునిగింది మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తమ్ముడు బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ చెడగొట్టుకోగా.. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో చేరిన తమ్ముడిని గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలతో వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో ఇమడలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరినీ రెండు పార్టీలు నమ్మే పరిస్థితి లేదు. వీరు వేరే పార్టీల్లోకి వెళ్లే చాన్స్ లేదు. సో రాజకీయంగా వీరి భవిష్యత్ గందరగోళంలో పడిరదనే చెప్పవచ్చు. మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ గెలవడం కష్టమేనంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు అన్న చాటు తమ్ముడిగా గెలిచాడు. ఇప్పుడు పార్టీ మారి ఓడిపోతే అన్న పట్టించుకోడు. తిరిగి కాంగ్రెస్ లోకి రాలేడు. ఇటు బీజేపీ నుంచి గెలవలేకపోయాడు. సో రాజగోపాల్ రెడ్డి నిండా మునిగినట్టే అవుతుంది. ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో అసలు ప్రాధాన్యత దక్కదు. మరోసారి గెలిచే ఛాన్స్ ఉండదు. ఇక తమ్ముడి కోసం సొంత కాంగ్రెస్ నే కాలదన్నేలా కుట్రలు చేసిన వెంకటరెడ్డి రాజకీయాల్లో బ్యాడ్ అయిపోయారు. ఆయనను కాంగ్రెస్ వెలివేసే ప్రమాదం ఉంది. మొత్తంగా రెండిందాల ఎటు కాకుండా అయిపోయి రాజకీయంగా ఎవరూ నమ్మని స్థితికి వెంకటరెడ్డి దిగజారారు. అటు కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండక ఇటు బీజేపీలో చేరుదామన్న పిలుపు రాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగానే కనిపిస్తోంది.
మునుగోడుతో తొడగొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఓడడమే కాదు.. అన్నయ్య వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్ ను కూడా ఇబ్బందుల్లో పెట్టేశాడు. 18వేలకోట్ల కాంట్రాక్ట్ కోసమే ఆయన చేరారని టీఆర్‌ఎస్ చేసిన ప్రచారం కూడా ఆయన ఓటమికి దారితీసింది. ఇక బీజేపీ ఇస్తామన్న ఆ అతిపెద్ద కాంట్రాక్ట్ కూడా ఓటమితో ఇస్తారో లేదో?ఇలా కోమటిరెడ్డిబ్రదర్స్ ఇద్దరికీ మునుగోడు రాజకీయంగా పెద్దదెబ్బ తీసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంకోసం చూస్తున్న బీజేపీ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల బొక్కబోర్లాపడిందనే చెప్పాలి. ఫాంహౌస్ ఎపిసోడ్ కూడా బీజేపీని ఇరుకునపడేసింది. మొత్తంగా మునుగోడుతో ఇటు బీజేపీకి అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తీవ్ర నష్టమే కలిగిందని చెప్పాలి. మొత్తానికి రెంటికి చెడ్డ రేవడేనా కోమటిరెడ్డి బ్రదర్స్ పని.
డాక్టర్ వడ్లమాని కనకదుర్గ







