ఏపీ నుంచి కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం వుండొదని ప్రకటించారు. బీఆర్ఎస్ వల్లే తాము తీవ్రంగా నష్టపోయామన్న భావలో ఏపీ ప్రజలు వున్నారని వివరించారు. అందుకే దాని ప్రభావం శూన్యమని తేల్చి చెప్పారు. అయితే… ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేసే అధికారం మాత్రం వుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు.

మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని అన్నారు. ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారు. శని గ్రహాన్ని మించిన, జామాతా దశమగ్రహం చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని మండిపడ్డారు.