ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సంపదను బిహార్ కు దోచిపెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఏ ముఖం పెట్టుకొని, బిహార్ లో పర్యటించారని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో 15 శాఖలు ఉన్నాయని.. ఆ కుటుంబం మారితేనే తెలంగాణ బాగుడుతుందని చెప్పారు. . ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ను ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదని.. ఆయన మాట్లాడుతుంటే లేచి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడుతుండగా… బిహార్ సీఎం నితీశ్ లేచివెళ్లడానికి ప్రయత్నించారని కిషన్ రెడ్డి ఉదహరించారు.
కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ… కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని, ఏ ఒక్క రాష్గ్ర ప్రజలూ నమ్మలేదని చురకలంటించారు. కేసీఆర్ ను చూసి నేతలు నవ్వుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, కుటుంబ పాలననే దేశమంతా అమలు చేస్తారా? ఇదే తెలంగాణ మోడలా? అంటూ కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. లేదంటే 15 రోజుల పాటు ఫాం హౌజ్ లో వుండటం మోడలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణను గాలికొదిలేసి, ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, ఏ ముఖం పెట్టుకొని పర్యటిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.