డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన కిరణ్ దుగ్గిరాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కన్వెన్షన్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నరేన్ కొడాలితో పాటూ పదిమందికి పైగా డెట్రాయిట్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ నాయకత్వంలో డీటీఏ కొత్త పుంతలు తొక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా ఎన్నారైలు, డీటీఏ మద్దతుదారులు పాల్గొన్నారు.