ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం ముందే ప్రకటించినట్లుగా అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకూ అంతిమ యాత్ర సాగింది. కైకాల పెద్ద కొడుకు రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గొప్ప నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కైకాల కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.