సెహభాష్ రోహిణీ ఆచార్య…. లాలూ కుమార్తెపై ప్రశంసలు కురిపిస్తున్న నేతలు, ప్రజలు

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. సింగపూర్ లో నివసిస్తున్న ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య… తన తండ్రి లాలూకి కిడ్నీ దానం చేశారు. దీంతో ఆమెపై రాజకీయ నేతలు, ప్రజలు అందరూ ప్రశంసలు కురిపించారు. లాలూకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుందని డాక్టర్లు ప్రకటించగానే… రోహిణీ కిడ్నీ దానానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం లాలూ ఐసీయూలో వున్నారని ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ప్రకటించారు. కిడ్నీ దానం చేసిన కూతురు రోహిణి కూడా ఆరోగ్యంగా వున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిణీ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. లాలూ కుమార్తె రోహిణిని చూసి గర్విస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

https://twitter.com/yadavtejashwi/status/1599675635634667520?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1599675635634667520%7Ctwgr%5E6a0fe9e4b045555a07e5ad6251e6f5fe3adcf32b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fnational%2Frjd-president-lalu-prasad-yadav-kidney-transplant-successful-1507650

 

Related Posts

Latest News Updates