ఏప్రిల్ నెలకు గాను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధ్యక్ష బాధ్యతలను రష్యా చేపట్టింది. ఒకవైపు ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతూ ఆ దేశాన్ని నాశనం చేయాలన్న యుద్ధ కాంక్షతో ఉన్న రష్యాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. రొటేషన్ పద్ధతిలో యూఎన్ఎస్సీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దీనిలో సభ్యత్వం ఉన్న15 దేశాల్లో నెలకొకటి చొప్పున అధ్యక్ష పదవిని చేపడతాయి. చివరిసారిగా ఈ పదవిని రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టింది. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సైతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఈ పదవిని ఆయనకు ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.