జయ మరణం విషయంలో శశికళపై విచారణ జరిపించాలి… ఆర్ముగ స్వామి కమిషన్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై దర్యాప్తు జరిపించాలని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా జయలలిత మరణం విషయంలో నెచ్చెలి శశికళతో పాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి, జయ లలిత వ్యక్తిగత వైద్యుడిపై కూడా విచారణ జరపాలని కూడా ఆర్మగ స్వామి కమిషన్ సూచించింది. అంతేకాకుండా కమిషన్ వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకొని, దర్యాప్తు చేస్తే గానీ… ఒక నిర్ధారణకు రాలేమని కమిషన్ సూచించింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా కమిషన్ తన నివేదికలో తప్పుపట్టింది. జయలలిత చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే… ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016 గా ప్రకటించడాన్ని తప్పుబట్టింది.

 

 

జయలలిత మరణంపై గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని 2021 లో డీఎంకే తన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టులో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది.

Related Posts

Latest News Updates