శబరిమలలో ప్రసిద్ధి గాంచిన అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రసాదం తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్ కోర్ దేవస్థానమ్ బోర్డును ఆదేశించింది. ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగించారని ఫుడ్ సేఫ్టీ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ప్రసాద విక్రయాలను నిలిపేయాలని హైకోర్టు సూచించింది.
అయితే… యాలకులు లేకుండా తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రం విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టుఆదేశంతో 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ మిగిలిపోయింది. నిజానికి అరవణ ప్రసాదంలో వాడే యాలకులను ట్రావెన్ కోర్ బోర్డు అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే… ఈ యేడాది ఈ యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్స్ కు బోర్డు అక్రమంగా అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్ కంపెనీ పేర్కొంది.












