శ్రీశైలంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు చేసుకుని కార్తీక దీపాలు వెలిగించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో క్షేత్ర పరిధిలో సందడి నెలకొంది.  సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. రద్దీకి అనుగుణంగా గర్బాలయ స్పర్శ దర్శనాలు నిలిపివేయగా, సామూహిక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతున్నట్లు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉన్నందున దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు కిటకిటలాడాయి.

Related Posts

Latest News Updates