ప్రపంచవ్యాప్తంగా జై కొడుతున్నప్రేక్షకులు… మూడు వారాలైనా తగ్గని ‘కార్తికేయ – 2’ వసూళ్లు

కార్తికేయ-2 ఇప్పటికీ ఆ సినిమా జోరు తగ్గట్లేదు. సినిమా రిలీజై మూడు వారాలు దాటినా కానీ ఈ సినిమాకు మామూలుగా కలిసి రావట్లేదు. వీకెండ్స్‌కు తోడు ఈ చిత్రానికి ఇండిపెండెన్స్ డే.. జన్మాష్టమి.. వినాయక చవితి సెలవులు అన్ని విధాలా కలిసి వచ్చాయి. దీనికి తోడు ‘కార్తికేయ’ రిలీజైన వీకెండ్ నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు నార్త్ ఇండియాలో రిలీజైన ఏ సినిమా కూడా నిలబడలేదు. గత రెండు వారాలుగా విడుదల అవుతున్న సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం.. రెండో రోజు నుంచి వాటి థియేటర్లు వెలవెలబోయి ‘కార్తికేయ’ను మళ్లీ రీప్లేస్ చేయడం.. జనాలు కొత్త సినిమాలను పక్కన పెట్టి ‘కార్తికేయ-2’కే జై కొట్టడం ఇదీ వరస. ఈ వీకెండ్లో రిలీజైన ‘రంగ రంగ వైభవంగా’, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రాలకు కూడా పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. వచ్చే వారం ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ చిత్రం రిలీజవుతుండడంతో ఈ వారం హిందీలో కొత్త రిలీజ్‌లే లేవసలు. దీంతో ‘కార్తికేయ-2’ ఈ వారం కూడా ఇటు తెలుగులో, అటు హిందీలో బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ఇండియాలో దూకుడు ఇలా ఉంటే.. యుఎస్‌లో కూడా నాలుగో వారంలో ఆ సినిమా చూపిస్తున్న జోరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. శనివారం యుఎస్‌లో నేషనల్ సినిమా డే జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని టికెట్ ధరలను 3 డాలర్లకు తగ్గించారు. దీంతో ‘కార్తికేయ-2’ చూడడానికి జనం ఎగబడుతున్నారు. అక్కడ పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతుండడం.. కొత్త షోలు యాడ్ చేస్తుండడం విశేషం. ‘కార్తికేయ-2’ లాంటి చిన్న సినిమాకు నాలుగో వీకెండ్లో యుఎస్‌లో షోలు సోల్డ్ ఔట్ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. యుఎస్‌లో ఈ చిత్రం చాలా ముందే మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఫుల్ రన్లో ఇది 2 మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లేలా కనిపిస్తోంది. ఇక ‘కార్తికేయ-2’ వరల్డ్ వైడ్ ఓవరాల్ గ్రాస్ వసూళ్లు 120 కోట్ల గ్రాస్ ను దాటేసిన సంగతి తెలిసిందే.

Related Posts

Latest News Updates