ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు కర్తవ్య పథ్ ప్రారంభం కానుంది. వలస పాలనను చెరిపేస్తూ రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ కర్తవ్య పథ్ ప్రారంభం కానుంది. అక్కడే ఇండియా గేట్ దగ్గరున్న నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరిస్తారు. రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ వున్న ఈ మార్గాన్ని ఇకపై కర్తవ్య పథ్ గా వ్యవహరిస్తారు. ఇక… ఇండియా గేట్ దగ్గరున్న నేతాజీ విగ్రహం 28 అడుగుల ఎత్తులో జెట్ బ్లాక్ గ్రానైట్ తో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఖమ్మం నుంచి ఈ గ్రానైట్ ను తరలించారు.
ఇక… ఈ కర్తవ్య పథ్ లో శుక్రవారం నుంచి ప్రజలను అనుమతిస్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య పథ్ ను డెవలప్ చేశారు. అయితే… సెంట్రల్ విస్టా నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి ప్రజలను అనుమతించలేదు. శుక్రవారం నుంచి అనుమతిస్తారు. ఇక… సెంట్రల్ విస్టా ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ పార్కులు, గ్రానైట్ వాక్ వేలు, పార్కింగ్ ప్రదేశాలు, 16 వంతెనలు, రెండు చోట్ల బోటింగ్, గ్రీనరీ కనబడేలా గార్డెన్లను డెవలప్ చేశారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారు.