కర్నాటకలో బీజేపీకి షాక్… లంచం తీసుకుంటూ లోకాయుక్తకు దొరికిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతని ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీగా నోట్లకట్టలు బయపడ్డాయి. దీంతో పోలీసులు ఆయనను శుక్రవారం ఉదయం అరెస్టుచేశారు.

 

చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‌ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా రూ.6 కోట్లు దొరికాయి. దాంతో పాటు ఆయన కార్యాలయం నుంచి రూ.1.7 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. సబ్బులు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడిసరుకు డీల్‌ ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ నుంచి ప్రశాంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఈ సమయంలో సుమారు 3 బ్యాగుల నగదు లోకాయుక్తకు లభించింది.

Related Posts

Latest News Updates