తెలుగులో కూడా కుమ్మేస్తున్న ‘కాంతార’ దీపావళి పండగ కు కూడా ఆగేలా లేదు

కన్నడ బాక్సాఫీస్ వద్ద కాంతార సినిమా కలెక్షన్ల దుమారం రేపుతోంది. కాంతార సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి కావడం విశేషం. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైన కాంతార మూవీ, దేశ వ్యాప్తంగా సెన్షేషన్ క్రియేట్ చేసింది. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కాంతార మూవీని డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి తెలుగులో ఇప్పటి వరకు కాంతార ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. కన్నడలో కేజీఎఫ్ లాంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీని తీసిన హొంబలే ఫిల్మ్ కాంతార మూవీని నిర్మించింది. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార, కన్నడలో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన కాంతార, పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది.ఈ క్రమంలో ఇప్పటికే కన్నడలో కాంతార కలెక్షన్లు 100 కోట్లు దాటేశాయని ట్రెడ్ వర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా కర్నాటక లోని మెట్రో నగరాల్లో కాంతారకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీంతో ఓ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ, కలెక్షన్లు కొల్లగొడుతోంది ఈ క్రమంలో కాంతార మూవీని పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు ఆ చిత్ర నిర్మాతలు. ఇక తెలుగులో కూడా గతవారం కాంతార ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కాంతార విడుదలకు ముందు రోజు సినిమా చూసిన ప్రభాస్, ఆ సినిమాని ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తుతూ రివ్యూ ఇవ్వడం, అప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న మౌత్ టాక్, కాంతార మూవీకి ప్లస్ అయ్యింది. దీంతో వీకెండ్ పోయి, వర్కింగ్ డేస్ వచ్చినా, కాంతార కలెక్షన్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ప్రస్తుతం కాంతార ఆన్ లైన్ బుకింగ్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే దీపావళి వరకు, ఈ మూవీ బుకింగ్స్ డ్రాప్ అయ్యేలా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కాంతార తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ కలెక్షన్ల వివరాల పై ఓ లుక్కేస్తే.. తొలి రోజు తెలుగులో 3.2 కోట్లు వసూలు చేసిన కాంతార, రెండో రోజు 4.8 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడు రోజు సోమవారం వర్కింగ్ డే అయినా కాంతార 2.51 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ క్రమంలో తొలి రెండు రోజులు అంటే.. శని, ఆదివారాల్లో 11.5 కోట్లకు పైగానే గ్రాస్ సాధించిన కాంతార, మూడో రోజు ఏమాత్రం తగ్గకుండా 3.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు తెలుగులో కాంతార 12 కోట్ల షేర్ ను, 15 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని సినీ పండితులు తెలిపారు. ఇక కాంతార మూవీ హిందీలో నాలుగు రోజుల్లో 9 కోట్ల షేర్ ను రాబట్టగా, దాదాపు 16 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని సమాచారం. అలాగే ఓవర్సీస్ లో కాంతార కలెక్షన్లు 1.5 మిలియన్ డాలర్లకు చేరువైందని తెలుస్తోంది. ముఖ్యంగా కన్నడలో ఇప్పటి వరకు కాంతార 100 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కాంతార ఇప్పటి వరకు 120 కోట్ల షేర్ ను, 150 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Related Posts

Latest News Updates