కాంతార సీక్వెల్ వచ్చేస్తోందోచ్… ఎప్పుడంటే…

సూపర్ డూపర్ హిట్ కొట్టిన కాంతార… ఇప్పుడు రెండో భాగాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని హోబలే అధినేత విజయ్ కిరంగదూర్ తెలిపాడు. కాంతారకు సీక్వెల్ ను రూపొందించే యోచనలో వున్నామని తెలిపాడు. రిషబ్ తిరిగి వచ్చిన తర్వాత సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కి సంబంధించిన చర్చలు జరుపుతామని ప్రకటించాడు. అయితే.. కాంతారాను ఆస్కార్ కు కూడా పంపామని, ఫైనల్ నామినేషన్స్ ఇప్పటి వరకూ ప్రకటించలేదన్నారు. ఇక… ఐఎమ్‌డీబీ‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించిన చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. ‘కెజియఫ్ 2’ ‘ఆర్ఆర్ఆర్’ని బీట్ చేసేసింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Related Posts

Latest News Updates