రాజకీయాల్లోకి వస్తా.. లోక్ సభకు పోటీ చేస్తా .. కంగనా రనౌత్

బాలీవుట్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.  ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్‌ ఇస్తే రాజకీయాల్లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పోటీ చేయాలని తన మనసులో మాట బయటపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.  ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ పోటీదారుడు కావడం విచారకరమని అన్నారు.  మోడీకి ప్రత్యర్థులు లేరని అన్నారు.  హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లో చేరతానని, ఇది తన అదృష్టంగా భావిస్తాను  అని అన్నారు.

Related Posts

Latest News Updates