కందిరీగ హీరోయిన్‌ సినిమాటోగ్రాఫర్‌ను పెండ్లి చేసుకున్న.. పిక్స్‌ వైరల్‌!

రామ్‌ పోతినేని హీరోగా వచ్చిన కందిరీగ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన అక్ష గుర్తుందా! వరంగల్‌ బిడ్డగా తెలంగాణ యాసలో ఆమె మెస్మరైజ్‌ చేసింది. యువత సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన అక్ష పార్ధసాని.. కొత్తలో వరుస ఆఫర్లనే కొట్టేసింది. కానీ అవేవీ ఆమెకు పెద్దగా సక్సెస్‌ తీసుకురాలేకపోయింది. ఈ క్రమంలో 2017లో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన అక్ష.. ఇప్పుడు పెండ్లి చేసుకుని మళ్లీ వార్తల్లోకి వచ్చింది. https://cinemaabazar.com/

టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన అక్ష.. అప్పుడప్పుడు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాటోగ్రాఫర్‌ కౌశల్‌తో పరిచయం ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. పెద్దల్ని ఒప్పించి తాజాగా ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం నాడు పెండ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో జరిగిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలను అక్ష, కౌశల్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ పిక్స్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates