కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్‌లో రేషన్‌ షాప్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మాల సీతారామన్‌ రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతని కామరెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించారు.  అయితే కలెక్టర్‌ తెలియదని సమాధానం చెప్పడం కలెక్టర్‌ అయ్యుండి తెలియదంటారా అని నిర్మలా మండిపడ్డారు. అరగంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే రేషన్‌ షాపులో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడాన్ని నిర్మలా సీతారామన్‌ గమనించారు. మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు. మోదీ ఫ్లెక్సీ పెట్టకపోతే సాయంత్రం నేను వచ్చి కడతానని సీతారామన్‌ తెలిపారు. 2020 మార్చి నుంచి పేదలకు కేంద్రమే ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని ఆమె తెలిపారు.