శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “కళ్యాణమస్తు”. ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం నుండి ఇదివరకే వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. ప్రస్తుతం తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను శివబాలాజీ లాంచ్ చేసారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రెజెంట్ చేసారు. ట్రైలర్ మొదటినుండి చివరవరకు ఆసక్తికరంగా ఉంది.అద్భుతమైన విజువల్స్ తో, క్యూట్ లవ్ స్టొరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. “కళ్యాణమస్తు” సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృంధం.
డైరెక్టర్ ఒ.సాయి మాట్లాడుతూ, ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బోయపాటి రఘుబాబు గారికి శేఖర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇప్పటి వరుకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ని చూసి జనాలు నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మే 12న రాబోతుంది అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి. శివబాలాజీ మాట్లాడుతూ, ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క టెక్నీషియాన్ వారి ప్రతిభని ప్రదర్శించారు అండ్ ఆక్టర్స్ చాలా బాగా పెర్ఫాం చేశారు.
కాశి విశ్వనాద్ గారు మాట్లాడుతూ, ఒక చిన్న సినమాకి ఇండస్ట్రీలో ఉన్న పలువురు పేరున్న వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్లకి సిమాలో నచ్చే ఎలిమెంట్ ఏదో ఉంది అని అర్ధం. కంటెంట్ వైస్ సినిమా చాలా బాగుంది. ఆ కంటెంట్ లో నేనూ ఒక పాత్రని పోషించాను. శేఖర్ వర్మని చూస్తుంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో రవితేజ, శ్రీ విష్ణు లాంటి నటులు ఎంత ఆక్టివ్ గా ఉండే వాళ్ళో, అదే టైపులో చాలా కాషువల్ గా, ఈజీగా, న్యాచురల్ గా పెర్ఫార్మన్స్ చేస్తాడు. డేఫీనెట్ గా మంచి భవిష్యత్తు ఉంది.
హీరోయిన్ వైభవి రావ్ మాట్లాడుతూ, ఈ సినిమా నాకు చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ చాలా కష్టపడి పని చేశారు. కచ్చితంగా మీరందరూ సినిమాని చూసి విజయవంతం చెయ్యాలని కోరుకుంటున్నాను.
హీరో శేఖర్ వర్మ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఆడియన్స్ కోరుకునే ప్రతి ఎమోషన్ ఉంది, కామెడీ, డ్రామా, యాక్షన్, స్టొరీ, నా ముందు సినిమాలతో పోల్చుకుంటే నా మేక్ ఓవర్ చాలా బాగుంటుంది. ఈరోజుల్లో చిన్న సినిమాని థియేటర్ వరుకు తీసుకుని రావడం చాలా కష్టం అయిపొయింది, అలాంటిది మేము ఈ సినిమాని థియేటర్ వరుకు తీసుకుని వచ్చాము. కచ్చితంగా అందరూ చూసి ఆదరించాలిసిందిగా కోరుకుంటున్నాను..
నటీనటులు: శేఖర్ వర్మ, వైభవి రావ్
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: ఒ.సాయి, నిర్మాత: బోయపాటి రఘుబాబు, కెమెరామెన్: మల్లికార్జున్ నారగని, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను.