త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశరు. ఈ నెల 11 నుంచి త్రిపుర హైకోర్టుకు ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారని కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. జస్టిస్ అమర్ నాథ్ 1965 లో హైదరాబాద్ లో జన్మించారు. 2017 సెప్టెంబర్ 21 న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అలాగే ఉమ్మడి హైకోర్టు బార్అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా, సంయుక్త కార్యదర్శిగా, కోషాధికారిగా వున్నారు. 2021 అక్టోబర్ 28 న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.







