ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ ని నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నాడు. న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు. సూర్యకుమారి యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్ ,శార్దుల్ ఠాకూర్ తో పాటు మరికొంత మంది వున్నారు. అయితే.. కాసేపు జూనియర్ ఎన్టీఆర్ వీరితో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ మధ్యే ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు పాట అంతర్జాతీయంగా అవార్డులు తీసుకువచ్చింది. ఈ ప్రస్తావన కూడా ఈ భేటీలో వచ్చింది. ఈ సందర్భంగా క్రికెట్ టీమ్ సభ్యులు జూనియర్ కి కంగ్రాట్స్ చెప్పారు. అలాగే జూనియర్ ఎన్ఠీఆర్ సూర్యకుమార్ యాదవ్ తో ఎక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సూర్యకుమారి ఈమధ్య టీ20 లో చేసిన శతకం గురించి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించినట్టుగా తెలిసింది.