2024 ఎన్నికలు జేపీ నడ్డా సారథ్యంలోనే.. పదవీ కాలాన్ని పొడగించనున్న బీజేపీ

రాబోయే సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైన ఎన్నికలు. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. మరో వైపు విపక్షాలు ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో బిహార్ సీఎం నితీశ్, లాలూ భేటీ అయ్యారు. అయితే… ఇంతటి కీలక ఎన్నికలు కూడా ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలోనే జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ జేపీ నడ్డాయే అధ్యక్ష బాధ్యతల్లో వుంటారని, ఆయన పదవీ కాలాన్ని కొనసాగించడానికే బీజేపీ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.

 

2019 లో జేపీ నడ్డా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2020 నుంచి పూర్తి కాలపు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023 తో ఆయన పదవీ కాలం ముగిసిపోతోంది. రెండో సారి కూడా నడ్డానే కొనసాగించడానికి బీజేపీ సుముఖంగా వుంది. వ్యక్తి రెండు సార్లు పోటీ పడేలా పార్టీ రాజ్యాంగం రూపొందించుకుంది. నడ్డా పనితీరుపై బీజేపీ పూర్తి సంత్రుప్తిగానే వుందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ఎన్నికలు వుండగా… వచ్చే యేడాది కర్నాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణలో ఎన్నికలున్నాయి.

Related Posts

Latest News Updates