విపత్తు దిశగా జోషిమఠ్… 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిందని ఇస్రో నివేదిక

ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ లో కేవలం 12 రోజుల్లోనే 5.4 సెం.మీ నేల కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా షేర్ చేసింది. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాలు డిసెంబర్ 27 నుంచి జనవరి 8 మధ్య రోజులకు చెందినవిగా తెలిపింది. అయితే జోషిమఠ్ కేంద్రంగా ఉన్న ఆర్మీ హెలిప్యాడ్, దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో అధిక మొత్తంలో మట్టిని తవ్వడంతో.. జోషిమత్- ఔలీ రహదారికి సమీపంలో 2,180 మీటర్ల ఎత్తులో ఈ క్షీణత ప్రభావం అధికంగా ఉందని ఇస్రో వెల్లడించింది. అంతకుముందు కొన్ని నెలల క్రితమే జోషిమఠ్ మునిగిపోయే ప్రమాదం ఉందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. గతేడాది 9 సెంటీమీటర్ల మేర మునిగిపోయిందని వెల్లడించింది. బద్రీనాథ్ లో ఆలయాలు, భవనాలు, రోడ్లు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Related Posts

Latest News Updates