కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్రలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయా రాష్ట్రాల కళాకారులతో స్టెప్పులేస్తూ ముందకు సాగుతుంన్నారు. తెలంగాణలో జోడో యాత్రలో బతుకమ్మ, పోతరాజుల విన్యాసాలు చేశారు. అదే విధంగా మో ప్రాంతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను నడుపుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాహుల్ బుల్లెట్ నడుపుతుండగా పార్టీ శ్రేణులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ మూగిన ప్రజలను రాహుల్‌కు దారిఇచ్చేలా పక్కకు జరుపుతూ కనిపించారు. మొత్తం మీద భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటి వరకూ ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్ చేరుకుంది. కన్యాకుమారి నుంచి చేపట్టిన రాహుల్ గాంధీ పాదయాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతూ కశ్మీర్‌లో ముగియనుంది.












