జమ్మూ కశ్మీర్ లో దారుణం జరిగిపోయింది. ఏకంగా జైళ్ల శాఖ డీజీపీనేనే లష్కరే తోయిబా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనం రేగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను ఆయన నివాసంలోనే గొంతు కోసి హత్య చేశారు. హత్య చేయడమే కాదు… తగలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన శరీరంపై గాయాలు కూడా వున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే.. డీజీపీ హత్యకు తామే బాధ్యత వహిస్తున్నామని లష్కరే తోయిబా ప్రకటించుకుంది. మరోవైపు డీజీపీ ఇంటి పని మనిషి యాసిర్ ప్రధాన నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇలాంటి చర్యలు మరికొన్ని కూడా చేస్తామని ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటించింది. ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలమని హెచ్చరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ముందు తాము చిన్న గిఫ్ట్ ఇస్తున్నామని, అదే ఇది అంటూ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.