ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం… దమ్ముంటే అరెస్ట్ చేసుకోడంటూ సవాల్

అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. పైగా ఈడీకే సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తాను దోషినైతే… ప్రశ్నించడం ఎందుకు? నేరుగా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు కదా? అంటూ సూటిగా సవాల్ విసిరారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని వేధించే ప్రక్రియలో భాగంగానే ఈడీ తనకు సమన్లు జారీ చేసిందని ఆరోపించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీఎం సోరెన్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీబీఐకి గానీ, ఈడీకి గానీ తాను భయపడనని తేల్చి చెప్పారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న వారి గొంతు నొక్కేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని హేమంత్ సోరెన్ మండిపడ్డారు.

 

అక్రమ మైనింగ్ కేసులో ఈ నెల 3 న విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ నోటీసులు పంపింది. జార్ఖండ్ లో వున్న ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే… ఈడీ విచారణకు సీఎం హాజరు కాలేదు. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో సహా మరో ఇద్దర్ని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

Related Posts

Latest News Updates