• విశాఖపట్నంలోని CMR సెంట్రల్‌లో దయాగా వస్తున్న నటుడు JD చక్రవర్తితో ప్రేక్షకులకు ప్రత్యేక సంభాషణ జరిగింది.
• ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హాట్‌స్టార్ స్పెషల్స్ గా దయా ఆగస్ట్ 4, 2023న విడుదల కానుండగా, ఉత్కంఠతో కూడిన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి
విశాఖపట్నం, 5 ఆగస్టు, 2023: ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ నటుడు JD చక్రవర్తిని దయా (డిస్నీ+ హాట్‌స్టార్ OTTలో వస్తున్న కొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్)గా ఈ సాయంత్రం విశాఖపట్నంలోని CMR సెంట్రల్‌లో పరిచయం చేసింది. OTT ప్లాట్‌ఫారమ్‌లో మొదటిసారి దయాగా వస్తోన్న నటుడు జెడి చక్రవర్తి ని ప్రేక్షకులు కలుసుకోవటం తో పాటుగా ప్రత్యేకంగా సంభాషించే అవకాశం కలిగింది.
దయా యొక్క కథ, టైటిల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది, ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ తన వ్యాన్ లోపల నిర్జీవమైన శరీరాన్ని కనుగొన్నప్పుడు అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. వెబ్ సిరీస్‌లో వైవిధ్యమైన నటుడు జెడి చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబేసన్, విష్ణుప్రియ, కమల్ కామరాజ్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు నటించారు. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
డిస్నీ+ హాట్‌స్టార్‌తో OTT అరంగేట్రం చేసిన నటుడు,నటుడు జెడి చక్రవర్తి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ “డిస్నీ+ హాట్‌స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా వున్నాను. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం మరియు తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్ నాకు దానిని అందించింది” అని అన్నారు
ఈ కార్యక్రమంలో, జెడి చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా మాట్లాడారు, ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో తన పాత్రపై వారి సందేహాలను ఓపికగా నివృత్తి చేశారు. కొంతమంది అతని వయస్సు గురించి అడిగారు. అలాగే, అతను తన అభిమానులతో వ్యక్తిగత విశేషాలు మరియు సెల్ఫీలను క్లిక్ చేస్తూ ఆహ్లాదకరమైన క్షణాలను పంచుకున్నారు.