దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో సహజ నటిగా వెలుగొందుతోంది జయసుధ. వయసులో ఉన్నప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా మెప్పించిన జయసుధ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో గొప్ప పాత్రలు చేసింది. ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. కానీ ఆమె కొడుకు నిహార్ మాత్రం కనీసం నటుడిగా కూడా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఎనిమిదేండ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిహార్.. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.
జయసుధ కొడుకు నిహార్ ఎనిమిదేండ్ల క్రితం బస్తీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2015లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు ఈ సినిమా వచ్చినట్లు చాలామందికి తెలియదనే చెప్పాలి. హీరోగా సక్సెస్ కాకపోవడంతో ఐదేండ్లు గ్యాప్ ఇచ్చిన నిహార్.. రూట్ మార్చి విలన్‌గానూ ట్రై చేశాడు. రెండేండ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాలో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్‌గానే మిగిలింది. దీంతో నిహార్ మళ్లీ మొదటికొచ్చాడు. ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రికార్డ్ బ్రేక్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తెలుగులో నిర్మించిన ఈ చిత్రాన్ని మరో 8 భాషల్లో అనువదించి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. https://cinemaabazar.com/