మన పానీపూరీ…. మామిడి పన్నా టేస్ట్ ను ఎంజాయ్ చేసిన జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని పుమియో కిషిదకి మన పానీ పూరీ భలే నచ్చింది. భారత పర్యటనలో వున్న జపాన్ ప్రధానికి మన ప్రధాని నరేంద్ర మోదీ పానీపూరీ టేస్ట్ చూపించారు. దీంతో ఆయనకు ఈ టేస్ట్ భలే నచ్చింది. అలాగే మన భారత దేశ వంటకాలను కూడా రుచి చూపించారు. భారత్, జపాన్ మధ్య వున్న సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు ఇరు దేశాల ప్రధానులు ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ బుద్ధ జయంతి పార్క్ ను తిరిగారు. తిరిగిన తర్వాత అక్కడే వున్న స్టాల్స్ కి వెళ్లారు. అక్కడ భారతీయ వంటకాలను రుచి చూశారు. పానీపూరీతో పాటు ఫ్రైడ్ ఇడ్లీ, మామిడి షరబత్ కూడా రుచిచూశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు.

భారత్ , జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు దేశాలు పరస్పర ప్రజాస్వామ్య విలువలను గౌరవించుకుంటాయన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశం కావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతేడాది తామిద్దరం అనేకసార్లు కలుసుకున్నామని..కిషాదాను కలిసినప్పుడల్లా భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఆయన చూపే సానుకూలత, నిబద్దతను చూస్తే సంతోషం కలుగుతుందన్నారు. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Related Posts

Latest News Updates