ఏపీలో జనసేన వర్సెస్ మంత్రి అంబటి రాంబాబు నడుస్తోంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. దీనిపై మంత్రి అంబటి విమర్శలు చేయడం ప్రారంభించారు. అన్నయ్య షోకు డుమ్మా, బాలయ్య షోకు జమ్మ… రక్తసంబంధం కన్నా.. ప్యాకేజీ సంబంధమేగొప్పదా అంటూ మంత్రి ట్వీట్ చేశారు. అయితే.. ఈ ట్వీట్ కు పవన్ కల్యాన్ సోదరుడు నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏయ్… ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ. సోది అంటూ ట్వీట్ చేయడంతో అది మరింత ముదిరింది. దీంతో జనసేన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఇది కాగానే.. బుధవారం మంత్రి అంబటి మళ్లీ పవన్ పై విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి జనసేన అధినేత పవన్ ఊడిగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారని, ఇద్దరూ కలిసి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క చోట కూడా పవన్ గెలవలేదని, అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తారా?అని మంత్రి అంబటి ప్రశ్నించారు.